తూర్పు తక్కెళ్ళపాడు గ్రామం

తక్కెళ్ళపాడు అను గ్రామ నామం తొలుత క్రీస్తు శకం రెండవ శతాబ్ధంలో జగ్గయ్యపేట శాసనం నందు మరియు బౌద్ధ వాంగ్మయం నందు కన్పిస్తుంది. తక్కెళ్ళపాడు అనగా

తక్కిలికాయ = టమోటకాయ అని, పాటి అనగా ప్రసిద్ధిచెందిన ప్రాంతం లేక గొప్పదైన ప్రదేశం అని అర్ధం.

బౌద్ధ బిక్షకులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు టమోట పంటకు ప్రసిద్ధిచెందిన ప్రాంతము అనే ఉద్ధేశ్యంతో తక్కిలిపాటి అని పిలవటం జరిగింది. కాలక్రమేన తక్కెలిపాటిగా ప్రసిద్ధి చెందింది. అది ఇప్పుడు తక్కెళ్ళపాడుగా పిలుచుచున్నారు.

ఆంద్రదేశం నందు దాదాపు 39గ్రామాలకు ఈపేరు ఉంది. ప్రతిజిల్లా నందు దాదాపుగా 1, 2 గ్రామాలకు ఈ పేరు ఉంది.

1) 12వ శతాబ్ధంలో కాకతీయులు యొక్క పాలనలో తీరాంద్ర ప్రాంతమైన మోటుపల్లి అనే ప్రసిద్ధ ఓడరేవు ఉంది. (ప్రస్తుతం ప్రకాశంజిల్లా). ఈ యొక్క ఓడరేవునకు రోమన్‌, చైనీస్‌, పోర్చుగీసు దేశాలతో వ్యాపారం జరిగింది. ఈకాలమున ఉత్తర భారతదేశమున ముస్లింలు దండయాత్ర జరుగుతూ ఉండటంవల్ల అప్పటివరకు అరబ్బులనుండి గుర్రాలు దిగుమతి చేసుకునే భారతీయ రాజులు ముస్లింల సంఘర్షణలతో పోర్చుగీసు, చైనీసు, రోమన్‌ల నుంచి గుర్రాలు దిగుమతి చేసుకోవడం జరిగింది. ముప్పాళ్ళ శాసనం ప్రకారం కాకతీయుల సామంతులైన రెడ్డిరాజులు ఈ గుర్రాలను దిగుమతి చేసుకుని వాటికి శిక్షణ ఇచ్చి కాకతీయ రాజులకు అందించేవారు. ఈ శాసనంలో మోటుపల్లి, చినగంజాం, ఉప్పుగుండూరు, రాచపూడి, రావినూతల, తక్కెళ్ళపాడు, ధర్మవరం, అద్దంకి, కొంవీడు గ్రామాలపేర్లు కన్పిస్తున్నాయి. అయితే తక్కెళ్ళపాడు ప్రాంతం వేపచెట్లు, చింతచెట్లు, మర్రిచెట్లతో పచ్చిక బైళ్ళతో సెలిమెళ్ళ వనాలతో రమణీయంగా ఉంది. గుర్రాలను దిగుమతి చేసుకున్న వర్తకులు ఇక్కడ వీటిటి శిక్షణ ఇచ్చి పాలకులకు అందించేవారు. గుర్రాల వ్యాపారానికి కేంద్రబిందువు కావటం వలన దీనిని గుర్రాల తక్కెళ్ళపాడుగా లేదా అశ్వాల తక్కెళ్ళపాడుగా పిలవటం జరిగింది.

2) అద్దంకిని పాలిస్తున్న రెడ్డిరాజులు (శైవమతస్తులు) ఈ కాలంలో శైవ, వైష్ణ మతాల మధ్య విరోధాల వల్ల ప్రభువు అనుసరిస్తున్న మతమే ప్రజలకు శాసనం కావటం వల్ల కొటప్పకొండ కేంద్రంగా శైవమతం ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా వ్యాపార కేంద్రంగా ఉన్న తక్కెళ్ళపాడు ప్రాంతాన్ని శైవమతాన్ని ప్రచారం చేసే శైవులకు ఇవ్వటం జరిగింది. వీరినే జంగమ దేవరులని పిలవటం జరిగింది. ఈ జంగముల యొక్క ఆధీనంలో ఉండటంవల్ల జంగాల తక్కెళ్ళపాడుగా పిలవటం జరిగింది.

3) కృష్ణదేవరాయుల గురువు అయిన తాతాచార్యులు ఈ ప్రాంతాన్ని తనయొక్క శ్రీవైష్ణవ మతాన్ని అనుసరించిన వేద పండితులు అయిన తిరుపతి ప్రాంతంలో నివసిస్తున్న శ్రీమాన్‌ వేదాంత దేశికాచార్యులు ఆధ్వర్యంలో తిరుమల తమిళ బ్రహ్మణులైన అయ్యంగార్స్‌కి ఈ అగ్రహారం ఇవ్వటం జరిగింది. ఈ అగ్రహారం క్రింద 21గ్రామాలు ఉండేవి. 8 అద్దంకికి పడమటవైపు, 13 తక్కెళ్ళపాడు పరిసరప్రతాంతాలనందు ఇవ్వటం జరిగింది. అయ్యవార్ల ఆధ్వర్యంలో ఈ అగ్రహారం ఉండటంవల్ల దీనిని అయ్యంగార్‌ తక్కెళ్ళపాడుగా పిలవటం జరిగింది.

1. అయ్యంగారి చరిత్ర:

భారతదేశ చరిత్ర మనం చూసుకున్నపుడు ఉత్తర భారతదేశంలో వైదిక మతం వ్యాప్తి చెందిన కాలంలో వైదిక మత లోపాలను (యగ్న, యాగాది ఖర్మ కాండలు)కు వ్యతిరేకంగా లోపాలను చూపిస్తూ బౌద్ధ, జైన మతాలు వ్యాప్తి చెంది రాజాధరణ కోల్పోయిన వైదిక మతస్తులు దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారు.

దక్షిణ భారతదేశాన సంగమ కాలానికి చెందిన (చేర,ఛోల, పాండ్యరాజులు) వీరిని ఆదరించి వైదిక మత పునరుద్ధరణకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఈ వైదిక మతస్తులైన ఆర్యబ్రహ్మణులు రాజ్యం, రాజు క్షేమం కొరకు యజ్ఞ యాగాదులు నిర్వహించి రాజ్యక్షేమం కోరటం వలన సంతోషించిన చక్రవర్తులు వీరికి అగ్రహారములు దానముగా ఇవ్వటంతో వీరుకావేరి నదీ ప్రాంతంలో శ్రీరంగ పట్టణం కేంద్రంగా చేసుకొని స్థిరపడినవారే శ్రీవైష్ణవులు. వీరే తమిళ బ్రహ్మణులుగా ప్రసిద్ధి చెందారు.

4) పరిపాలన సౌలభ్యం కొరకు 1904లో గుంటూరు జిల్లాను బ్రిటీషువారు ఏర్పాటు చేశారు. వారి వివరాలప్రకారం అద్దంకి తాలుకా ఏర్పాటైంది. అద్దంకి తాలుకానందు గ్రామాల పేర్లను చేర్చునపుడు అద్దంకి పశ్చిమంగానున్న కొప్పెరపాడుకు వైదన కొప్పెరపాడని, తూర్పువైపున్న కొప్పెరపాడుకు తూర్పు కొప్పెరపాడని పక్కనే ఉన్న తక్కెళ్ళపాడుకు తూర్పు తక్కెళ్ళపాడని నిర్ణయించటమైంది. అదే ఇప్పుడు తూర్పుతక్కెళ్ళపాడుగా ఆధునిక కాలంలో పిలవటం జరుగుతుంది. ఇలా మనఊరికి గుర్రాల తక్కెళ్ళపాడని, జంగాల తక్కెళ్ళపాడని, అయ్యవార్‌ తక్కెళ్ళపాడని, తూర్పు తక్కెళ్ళపాడని కాలానుగుణంగా పిలవటం జరిగింది.

2. అయ్యంగార్‌ :

ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఆర్యులు కావటం వల్ల ఆర్య-అయ్య అని, దక్షిణ భారతదేశంలోని గారు కలిపి అయ్యగారు (Respected sir) అలా అయ్యంగార్‌ పేరు వచ్చిందని ఉత్తర భారత చరిత్రకారుల అభిప్రాయం. దీనిని దక్షిణ భారత చరిత్ర కారులు ఆమోదించలేదు. అయ్యంగార్‌ అనే పదం 15వ శతాబ్ధం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది. అయ్యంగార్‌ అనగా (iy-angam) 5విధాలైన సంస్కారాలు అనుసరించువారు అని అర్ధం.

ఈ 5సంస్కారాలు

1. భుజములపై శంఖు, చక్రాలు గుర్తులుగా కలిగి ఉండే సంస్కారం.

2. 12 రకాలైన (ద్వాదశ) నామాలు దరించుట అని అర్ధం (నామం అంటే నిలువు బొట్టు).

3. శ్రీవారికి దాసులము అని ప్రకటించుట.

4. గురువు దగ్గర ఉపదేశం పొందటం.

5. సాల గ్రామాలను పూజించుట.

ఈ ఐదు సంస్కారాలను అనుసరించువారే అయ్యంగార్‌.

Loading